Saturday, December 21, 2024

నేషనల్ హెరాల్డ్ కేసులో రెండోసారి ఈడీ ఎదుట హాజరైన సోనియా గాంధీ !

- Advertisement -
- Advertisement -

 

Sonia Gandhi 2nd time before ED

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కు మనీలాండరింగ్ డబ్బు అందిందన్న ఆరోపణలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నేడు రెండో రౌండ్ ప్రశ్నల కోసం  ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) ఎదుట హాజరయ్యారు.  ఆమె వెంట ప్రియాంక గాంధీ కూడా వచ్చారు. ఆమె తనతోపాటు మెడిసిన్ బాక్స్ ను కూడా తెచ్చారు. సోనియా గాంధీని ప్రశ్నించేప్పుడు వెంట ఉండేందుకు ప్రియాంక గాంధీకి ఈడి అనుమతించింది. అయితే వేరే గదిలో ఉండాలంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలైన సోనియా గాంధీని అదనపు డైరెక్టర్ మోనికా శర్మ, ఆమె టీమ్ ప్రశ్నిస్తోంది. విశేషమేమిటంటే ఐదు రోజుల క్రితం రాహుల్ గాంధీని ప్రశ్నించిన ప్రశ్నలనే సోనియా గాంధీకి కూడా వేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News