Monday, December 23, 2024

మలయాళ నటి సోనియా మల్హర్ స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మీటూ’ ఆరోపణలు సంచలనం రేకిస్తున్నాయి. నటుడు జయసూర్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సోనియా మల్హర్ ఆరోపించారు.. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై జయసూర్య తాజాగా స్పందిస్తూ, మల్హర్ ఆరోపణల్లో నిజంలేదని, తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. ఈ విషయంలో తాను న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై నటి మల్హర్ తాజాగా స్పందించారు.

తనవి తప్పుడు ఆరోపణలని జయసూర్య కొట్టిపారేయడంపై మండిపడ్డారు. తనకు ఎదురైన, తాను ఎదుర్కొన్న వేధింపులనే బయటపెట్టానని వివరించారు. బెదిరింపులకు భయపడబోనని, తన ఆరోపణలను వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తన ప్రతీ ఆరోపణా నిజమేనని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తన జీవితంలో ఇదే తొలిసారి అని మల్హర్ వివరించారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు వచ్చాక ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టినట్లు నటి సోనియా మల్హర్ చెప్పారు. అయితే ఆ సమయంలో తాను జయసూర్య పేరు బయటపెట్టలేదన్నారు. కానీ ఆ తర్వాత తనపై విమర్శలు రావడంతో తన గౌరవాన్ని కాపాడుకోవడానికే హీరో పేరు చెప్పడంతో పాటు తనపట్ల ఆయన ప్రవర్తించిన తీరును వివరించానన్నారు.

Jayasurya

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News