Friday, November 22, 2024

ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు సోనియా ఉద్వాసన

- Advertisement -
- Advertisement -

Sonia sacks PCC presidents of five states

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు ఉద్వాసన పలికారు. రాజీనామా చేయాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి పార్టీని పటిష్టం చేయాలని సోనియో యోచిస్తున్నారు. ఇందులో భాగం గానే సోనియా రాజీనామాలు కోరారని పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్‌లో వెల్లడించారు. మరోవైపు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు ఇప్పటికే రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌లో మార్పుల కోసం ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు కోసం కొందరు సీనియర్లు పట్టుబడుతున్న తరుణంలో సోనియా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌ల్లో ఎలాంటి ప్రభావం కాంగ్రెస్ చూపలేక చతికిల పడింది. దీనిపై ఆదివారం సిడబ్లుసి భేటీ జరిగింది. పార్టీ అధ్యక్షురాలిగా ఇంకొంత కాలం సోనియా గాంధీయే కొనసాగాలని భేటీలో నిర్ణయించారు. ఓటమికి కారణాలను సమీక్షించడంతోపాటు పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని సోనియాకే అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News