Wednesday, January 22, 2025

నాతో మాట్లాడకు: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

 

Sonia Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని పొరపాటున అన్న మాట చిలికి చిలికి పెద్దదయింది. లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడేదాకా దారితీసాయి. అధిర్ రంజన్ తాను వ్యక్తిగతంగా ముర్ముకు క్షమాపణలు చెబుతానే తప్ప సభా ముఖంగా కాదని తేల్చేశారు. బిజెపి కావాలనే గోరంతలను కొండంతలు చేస్తోందన్నారు.  ఈ నేపథ్యంలో దిగువసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడినప్పుడు  కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ‘ట్రెజరీ బెంచ్’(అధికారవర్గం) వైపుకు వెళ్ళి బిజెపి సభ్యురాలు రమాదేవితో ‘నన్నెందుకు ఈ వివిదాంలోకి లాగుతున్నారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు స్మృతి ఇరానీ కలుగజేసుకుని చౌదరి వ్యాఖ్యపై నిరసన తెలిపింది. సోనియా గాంధీ మొదట ఆమెను పట్టించుకోలేదు. కానీ స్మృతి ఇరానీ రెచ్చిపోతుండడంతో కోపగించుకున్నారు. ‘నాతో మాట్లాడకు’ అన్నారు. దాంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సీన్లోకి ఎంటరై ‘బిజెపి సభ్యరాలిని మాట్లాడొద్దని అన్నారు’ అంటూ ఆక్షేపణ తెలిపారు. అప్పుడు బిజెపి సభ్యులు రమాదేవి, సోనియా గాంధీ చుట్టూ చేరేసరికి,  ఎన్సిపి సభ్యురాలు సుప్రియా సూలే, తృణమూల్ పార్టీకి చెందిన అపరూప పొద్దార్ ఆమెను వెంటబెట్టుకుని ‘ట్రెజరీ బెంచ్’కు దూరంగా తీసుకెళ్ళిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News