వికారాబాద్: ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన సంఘటన జిల్లా కేంద్రంలోని వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని రామయ్యగూడ కాలనీలో గురువారం చోటుచేసుకుంది.. సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం… ఫిర్యాదురాలి వడ్డె పోచమ్మ భర్త వెంకటప్ప, వీరు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తు, రామయ్యగూడ లో వుంటున్నారు. మృతుడు వెంకటప్ప (65) కి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు కుమార్తె ఉన్నది. రెండో భార్య ఫిర్యాదురాలి సొంత సోదరి సత్యమ్మను వెంకటప్ప వివాహం చేసుకున్నాడు, ఆమెకు ఇద్దరు కుమారులు శ్రీను, రాములు, కుమార్తె ఉన్నారు.
కొన్ని నెలల నుంచి సత్యమ్మ కుమారులు శ్రీను, రాములు ఇంటిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని వెంకటప్పతో గొడవ పడుతున్నారు. దీంతో వెంకటప్ప చనిపోయే వరకు ఇంటిని తమ పేర్లపై రిజిస్టర్ చేయనని చెప్పారు. వెంకటప్ప సొంత మనవరాలి వివాహం నిశ్చయించబడింది. వెంకటప్ప తన పేరు మీద ఉన్న ఇంటిని అమ్మి ఆమె మనవరాలికి పెళ్లికి డబ్బు ఇస్తానని చెప్పాడు. దాంతో శ్రీను, రాములు తమ తండ్రి బతికి ఉంటే తమ పేరు మీద ఇల్లు రిజిష్టర్ చేయడని, హత్య చేస్తే వారసత్వంగా ఇంటిని తమ పేరు మీద రిజిష్టర్ చేస్తారని భావించి బుధవారం రాత్రి వెంకటప్పతో గొడవకు దిగారు.
Also Read: బాలికపై సర్పంచ్ భర్త లైంగిక దాడి
వారసత్వంగా ఆస్తి చేజిక్కించుకోవాలని గురువారం సుమారు ఉదయం 6:30 గంటల సమయం లో వెంకటప్ప వారి ఇంటి ముందు ఉండగా, రాములు వెంకటప్ప తలపై రోకలి బండతో కొట్టగా, శ్రీను వెంకటప్ప గదవ కింద కూరగాయల కత్తితో పొడిచాడు. వెంకటప్ప కింద పడిపోవడంతో రాములు తలపై రోకలి బండతో మరోసారి కొట్టడంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై శ్రీను, రాములుపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు తెలిపారు.