Wednesday, January 22, 2025

తాగిన మైకంలో తల్లిని చంపిన కొడుకులు

- Advertisement -
- Advertisement -

తాగిన మైకంలో అన్నదమ్ముల గొడవకు అడ్డు వచ్చిందని ఓ వృద్ధురాలైన తల్లిని కుమారులు చంపారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ పంచాయతీలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని ఎన్కెపల్లి పంచాయతీకి అనుబంధంగా ఉన్న చెంచుపల్లికి చెందిన శంకరమ్మ (60) కొన్నేళ్ల క్రితం పరిగి మండలం, సయ్యద్‌మల్కాపూర్ గ్రామానికి తన ఇద్దరు కుమారులతో కలిసి వలస వచ్చింది. ఇక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటోంది. కూలి, నాలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తల్లితో ఆమె కుమారులు వెంకటయ్య, శ్రీను గొడవపడేవారు.

ఇదే క్రమంలో బుధవారం రాత్రి సమయంలో మద్యం సేవించిన ఇద్దరు కుమారులు, వారి భార్యలతో గొడవ పడ్డారు. ఎందుకు గొడవ పడుతున్నారని అడిగి జోక్యం చేసుకుని విడిపించేందుకు వచ్చిన తల్లిని రెండవ కుమారుడు శ్రీను ఎదలో తన్నాడు. దీంతో వెనక్కిపడిన శంకరమ్మ అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే అంబులెన్స్ సహాయంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ గురువారం సయ్యద్‌మల్కాపూర్‌ను సందర్శించి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News