Wednesday, January 22, 2025

సోనూ సూద్ ముఖ్యఅతిథిగా “తురమ్ ఖాన్‌లు”

- Advertisement -
- Advertisement -

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తురుమ్ ఖాన్ లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 31 న SVIT కాలేజ్ సికింద్రాబాద్ లో ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ కు రీల్ అండ్ రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా వచ్చి మరింత సందడి నెలకొల్పారు. వెండితెర హీరో సోనూ సూద్ చీఫ్ గెస్ట్ గా, అంబర్పేట్ శంకర్, చీకోటి ప్రవీణ్, చిన్న శ్రీశైలమ్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం అన్ని పనులను ముగించుకొని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 8వ తేదీన విడుదలకు రంగం సిద్ధం అయ్యింది.

ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ముందుగా చిన్న సినిమా అని తెలిసి.. నేనున్నా అంటూ ముందుకు వచ్చిన బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ కు ధన్యవాదాలు తెలిపారు. చిన్న సినిమాను విడుదల చేయడం ఈ రోజుల్లో ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ, ప్రొడ్యూసర్ ఎండి ఆసిఫ్ జానీ సాహసించి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఎంతో పరిణితితో.. సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడని డైరెక్టర్ శివ కళ్యాణ్ ను ప్రశంసించారు. కొత్త వాళ్లతో సినిమా తీయడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అయినప్పటికీ, ఆ పనిని విజయవంతంగా శివ కళ్యాణ్ నిర్వర్తించాడని ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నిర్మాత బెక్కం వేణుగోపాల్ వెల్లడించారు.

“తురుమ్ ఖాన్ లు” హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. తను పదవ తరగతిలో ఉన్నప్పుడు అరుంధతి సినిమా చూసి 103 జ్వరంతో హాస్పటల్ బెడ్ పై ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. అలా సోనూ సూద్ ను చూసి భయపడిన తాను ఈరోజు ఆయన పక్కనే నిలబడి మాట్లాడడం తనకెంతో ఆనందమని, తాను హీరోగా పని చేసిన “తురుమ్ ఖాన్ లు” చిత్రానికి ముఖ్యఅతిథిగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోనూ సూద్ గురించి ఏం చెప్పినా తక్కువే అని, ఆయన “రియల్ తురుంఖాన్ ఆఫ్ ఇండియా” గా అభివర్ణించారు.

ఇక తన లైఫ్ లో వాళ్ల నాన్న, తన ఫ్రెండ్ బబ్లూ, ఈ సినిమా డైరెక్టర్ శివ కళ్యాణ్ ఈ ముగ్గురు ఎంతో ప్రాధాన్యత వహించారని పేర్కొన్నారు. సినిమాలో స్టార్ క్యారెక్టర్ లేకపోయినా, అందరూ కొత్తవాళ్ళైనా సరే రెండున్నర గంటలసేపు ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుందని, అలానే డైరెక్టర్ శివ కళ్యాణ్ తెరకెక్కించారని నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత ఆసిఫ్ జానీ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో ఇష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కడే తన భుజాలపైన సినిమాను మోసాడని కొనియాడారు. అలాగే తనతో పాటు యాక్టింగ్ చేసిన కో యాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

తుపాకులగూడెం అనే ఒక విలేజ్లో విష్ణు ఈశ్వర బ్రహ్మ అనే ముగ్గురు క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ నడుస్తుందని డైరెక్టర్ శివ కళ్యాణ్ వెల్లడించారు. పురాణాల్లో ఉండే బలమైన క్యారెక్టర్లను సినిమాలో అత్యద్భుతంగా ఆవిష్కృతం చేశామని పేర్కొన్నారు. ఇక సినిమా నిర్మాత ఎండి ఆసిఫ్ జానీ ఎంతో కృషి చేశారని, ఆయన లేకుంటే ఈరోజు ఇలా వేడుక చేసుకునే వారం కాదని అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని, సెప్టెంబర్ 8న అందరు తప్పకుండా థియేటర్లో సినిమాను చూడాలని పేర్కొన్నారు.

నిర్మాత ఎండి అసిఫ్ జానీ మాట్లాడుతూ.. తురుమ్ ఖాన్ లు చిత్రంలో మంచి కంటెంట్ ఉందని, ఈ సినిమా ను ప్రమోట్ చేయడానికి అసలైన తురుంఖాన్ సోనూసూద్ ఉంటేనే బాగుంటుందని అన్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సోనూ సూద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ మాట్లాడుతూ.. తురుమ్ ఖాన్ లు చిత్రాన్ని చూశానని, ఈ సినిమాను ఒక్కసారి చూస్తే రెండోసారి చూడకుండా ఉండలేరని ఆయన పేర్కొన్నారు. మనసులో ఉన్న మరో కోణాన్ని ఈ చిత్రంలో కామెడీ వేల అద్భుతంగా చూపించిన డైరెక్టర్ శివ కళ్యాణ్ ను మెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను చూసినప్పటికీ ఇలాంటి కామెడీ ఉన్నా చిత్రాన్ని తన జీవితంలోనే చూడలేదని పేర్కొన్నారు. నటీనటులు అంతా కొత్తవారే అయినా సినిమా చూసిన తర్వాత వారి పాత్రలతో ప్రేమలో పడిపోతామని అన్నారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కడుపుబ్బ నవ్వుకునే చిత్రమని తెలిపారు.

రియల్ హీరో సోనూ సూద్ మాట్లాడుతూ మొదటగా తురుమ్ ఖాన్ లు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏ సినిమా ఖచ్చితంగా 500 కోట్లు వసూళ్ చేసే సినిమాగా ఎదుగుతుందని ఆయన తెలిపారు. సినిమాను నిర్మించడం ఎంత పెద్ద కష్టమో ఆయనకు తెలుసని ఈ విషయంలో నిర్మాత ఎండి ఆసిఫ్ జానీని మెచ్చుకున్నారు. తను సినిమా ప్రయత్నాలు చేస్తున్న రోజులను గుర్తు చేస్తూ.. మనం సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం ఉంటుందని, అందుకని ప్రేక్షకులు అందరూ తురుమ్ ఖాన్ లు చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు.

సినిమాలో చాలా మంచి సబ్జెక్టు ఉందని వచ్చే సంవత్సరానికి తురుమ్ ఖాన్ లు పార్ట్ 2, పార్ట్ 3 తీయాలన్నారు. తాను పంజాబ్ కు చెందినవాడైన తెలంగాణ ఆంధ్ర ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించారని అన్నారు. తాను హిందీ సినిమాలను వదిలేసి తెలుగు సినిమాలను చేస్తున్నప్పుడు చాలామంది తనను ఎందుకు అని అడిగారని… అప్పుడు తెలుగు సినిమా తనని నటుడిని చేసిందని, తెలుగు సినిమా తనకు క్రమశిక్షణ నేర్పిందని అందుకే తెలుగు వారన్నా, తెలుగు సినిమా అన్న తనకు ఇష్టం అని చెప్పారు. సాధ్యమైనంత వరకు తాను ఎంటర్ టైన్ చేస్తానని అన్నారు.

సినిమాలో మరో హీరోగా పని చేసిన అవినాష్ ఐశ్వర్య తదితరులు మాట్లాడారు. చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చిత్రం సెప్టెంబర్ 8న ఘనంగా విడుదల కాబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు  సినిమాను చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News