Wednesday, January 22, 2025

రాష్ట్రపతి అవార్డు గ్రహీతకు సోనూసూద్ సాయం

- Advertisement -
- Advertisement -

 

ముంబై: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి సంగీత విద్వాంసుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్‌పై స్పందించిన సోనూసూద్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. “ఖాన్ సాహిబ్, మొదట మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తర్వాత మీ సారంగి పాట వింట” అని రీట్వీట్ చేశాడు.

ఇంద్రజిత్ బార్కే అనే వ్యక్తి హర్యానాకు చెందిన ప్రముఖ సారంగి ప్లేయర్ మమన్ ఖాన్ ఆరోగ్యం బాగోలేదని, అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో తన ఫోటోను షేర్ చేస్తూ తన దయనీయ స్థితిని వివరించాడు. హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన మమన్ ఖాన్ (83). తన సంగీతంతో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు.

హర్యానా ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రభుత్వం అతనికి పౌర సంబంధాల శాఖలో ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మమన్ ఖాన్ తాత, తండ్రి జింద్ మహారాజా ఆస్థానంలో సారంగి వాద్యకారులు. రియల్ హీరో స్పందించడంతో అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News