Wednesday, January 22, 2025

‘నువ్వు చూపించిన మార్గంలోనే నడుస్తున్నా… హ్యాపీ బర్త్ డే అమ్మా’

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన తల్లి సరోజ సూద్ జయంతి సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా కనిపించడంలేదని తలుచుకుంటూ హ్యాపీ బర్త్‌డే అమ్మా అంటూ బావోద్వేగంతో సోషల్ మీడియాలో సోనూ పోస్టు చేశాడు. తన తల్లి చూపించిన మార్గంలోనే ఇప్పటికి నడుస్తున్నానని, నువ్వు నేర్పిన సూత్రాలు, నైతిక విలువలతో జీవనం కొనసాగిస్తున్నానని తెలిపాడు. ఒక్కసారి ప్రేమగా హత్తుకొని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉందన్నాడు. కరోనా సమయంలో వేల మందికి సోనూసూద్ సాయం చేశాడు. దీంతో రియల్ హీరోగా జనాల్లో పాతుకుపోయాడు. సాయం కావాలని చేయి చాపితే చాలు చేయూతనందిస్తున్నాడు. తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లు అందించేందుకు 2022లో నడుంబిగించాడు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News