పాట్నా : యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై స్కూలుకు వెళ్లే వీడియో వైరల్ కావడంతో ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ వెంటనే స్పందించారు. త్వరలోనే ఆమెకు సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు అలాగే గెంతుకుంటూ వెళ్తోంది. రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయింది. అయినా చదువు కోవాలని ఆమె తపన ముందు వైకల్యం ఓడిపోయింది. దీనికి సోనూసూద్ చలించి ఇక నువ్వు స్కూల్‌కు ఒక కాలిపై గెంతుకుంటూ వెళ్లవు. టికెట్స్ పంపిస్తున్నా వచ్చేయ్. నువ్వు రెండు కాళ్లపై చెంగుచెంగున స్కూల్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని సోనూసూద్ ట్వీట్ చేశారు.
अब यह अपने एक नहीं दोनो पैरों पर क़ूद कर स्कूल जाएगी।
टिकट भेज रहा हूँ, चलिए दोनो पैरों पर चलने का समय आ गया। @SoodFoundation 🇮🇳 https://t.co/0d56m9jMuA— sonu sood (@SonuSood) May 25, 2022