- Advertisement -
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండదని నటుడు సోనుసూద్ ప్రశంసించారు. హెచ్ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కెటిఆర్ ,హీరో సోనుసూద్, ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని, వాళ్లకు సహాయపడటమే ఇక మన ముందున్న సవాలు అని తెలియజేశారు. జమ్మూ నుండి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసానని, ఒక్క తెలంగాణ నుండే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ తనకు తారసపడిందని, అది కెటిఆర్ కార్యాలయం నుంచి కొనియాడారు.
- Advertisement -