ఆదుకునేందుకే : సోనూ సూద్
ముంబై : తన సంపాదనతో ఏర్పడ్డ తన ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ఆపన్నులకు చేరుతుంది. జీవనదానం అందిస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పష్టం చేశారు. తన నివాసాలు, తమ సంస్థల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి) విస్తృతస్థాయి దాడులు సోదాలపై ఈ దాతృత్వపు హీరో తొలిసారిగా స్పందించారు. తన రూపాయి పేదలకు చేరుకుంటుంది. జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకుంటుందని తెలిపారు. ఆయన ఆయన అనుబంధ సంస్థలు రూ 20 కోట్ల రూపాయల మేరకు పన్నులు ఎగవేతకు పాల్పడ్డట్లు సిబిడిటి దాఖలు చేసిన అభియోగాలపై సోనూ సూద్ స్పందించారు. ఇప్పటి అభియోగాలను ప్రస్తావిస్తూ జీవిత గమనంలో ఎదరయ్యే ప్రతి విమర్శకు తరచూ జవాబులు ఇస్తూ వెళ్లాల్సిన అవసరం లేదని, కాలమే అన్నింటికి జవాబు చెపుతుందని అన్నారు.
ఈ మధ్య కొద్దికాలంగా తాను అతిధులతో తీరిక లేకుండా ఉన్నందున , పేదల సేవకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయినట్లు తెలిపారు. ఇప్పుడు తాను మునుపటి తరహాలోనే అదే స్పందనతోనే ప్రజల ముందుకు వచ్చినట్లు ,వారికి విలువైన సేవలు అందించేందుకు సిద్ధం అయినట్లు తెలిపారు. పేదలకు సాయం అందించడం, జీవనం కోసం ఆరాటపడుతున్న వారిని ఆదుకోవడం అనేదే తన ప్రక్రియ అని, దీనికి విరామం ఇవ్వకుండా ముందుకు తీసుకువెళ్లుతామని తెలిపారు. తన ప్రయాణం సాగుతుందని చెపుతూ జై హింద్ అంటూ ట్వీటు ముగించారు. కర్ భలాతో హో భళా , అంత్ భళే కా భళా అని హీందీ వ్యాఖ్యానం జోడించారు. మంచి చేస్తూ ఉంటే ఫలితం మంచే అవుతుంది. చిట్టచివరికి మేలు చేసే వారికి మంచే జరుగుతుందని ఇందులో తెలిపారు.