Monday, December 23, 2024

సోనూ ఔదార్యంతో చిన్నారికి కొత్త జీవితం

- Advertisement -
- Advertisement -

Sonu Sood Turns Saviour For Bihar Child

ముంబై : కరోనా మహమ్మారి వేళ ఆపన్న హస్తం చాచి గొప్ప మనసు చాటుకున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడినప్పటికీ తన సహాయ కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తున్నారు. తాజాగా బీహార్‌కు చెందిన చౌముకి కుమారి అనే చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బీహార్ లోని చిన్నగ్రామానికి చెందిన కుమారి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఆమె గురించి తెలుసుకున్న సోనూ ఆమెకు చికిత్స చేయిస్తానని ఇటీవల మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆ చిన్నారి తన గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైందని సోనూ వెల్లడించారు. ఆమెకు చేసిన ఆపరేషన్ విజయవంతమైందని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రాలను షేర్ చేశారు. దీనిపై బాలీవుడ్ ఇతర ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News