Tuesday, January 7, 2025

పేదింటి అమ్మాయికి కంటిచూపునందించిన సోనూసూద్!

- Advertisement -
- Advertisement -

ముంబై: రియల్ హీరో సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎంతో మందికి సహాయసహకారాలందించి వారి జీవితాలు బాగుచేశాడు. తాజాగా మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్ గావ్ పట్టణానికి చెందిన గాయత్రి థోరట్ అనే బాలికను ఆదుకున్నాడు. ఆమె కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎడమ కంటిలో సున్నం పడడంతో దృష్టి పోయింది. అప్పటి నుంచి ఆమె కుడి కన్నుతోనే పనులు చేసుకుంటూ వస్తోంది. కానీ ఆమెకు దేవుడిలా సాయం అందించాడు సోనూ సూద్.

కోపర్ గావ్ కు చెందిన సామాజిక కార్యకర్త వినోద్ రక్షే గాయత్రి ఆమె విషయాన్ని సోనూసూద్ కు తెలిపింది. వెంటనే సోనూసూద్ ప్రతిస్పందించి ఆమె కంటి శస్త్ర చికిత్సకు సాయం అందించాడు. ఇప్పుడు గాయత్రి తన రెండు కళ్లతో ప్రపంచాన్ని చూడగలుగుతోంది. ఆమె సోనూ సూద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News