Wednesday, April 2, 2025

కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి

- Advertisement -
- Advertisement -

Sonu Sood's sister who joined the Congress

గేమ్ ఛేంజర్‌గా పంజాబ్ పిసిసి చీఫ్ కామెంట్

చండీగఢ్: నటుడు, దాతృత్వవేత్త సోనూసూద్ సోదరి మాళవికసూద్ కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌సిద్ధు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌చన్నీ సమక్షంలో సోమవారం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆమె చేరిక తమ పార్టీకి గేమ్ ఛేంజర్‌లాంటిదిగా సిద్ధు అభివర్ణించారు. ఓ వ్యక్తిని గౌరవంగా పార్టీలోకి తీసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లడం అరుదైన ఘటన అని సిద్ధు అన్నారు. మోగా జిల్లాలోని ఆమె నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆమె మోగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారా..? అన్న ప్రశ్నకు చన్నీ సమాధానమిస్తూ పార్టీ ఆమెకు అవకాశమిస్తుందన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించిన విద్యావంతురాలైన మహిళ తమ పార్టీలో చేరడం తమకు సంతోషం కలిగిస్తోందని సిద్ధు అన్నారు. తన సోదరి రాజకీయాల్లో చేరనున్నట్టు గత నవంబర్‌లో సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజాసేవకు అంకితమవ్వడానికే రాజకీయాలను ఎంచుకున్నానని మాళవిక ఈ సందర్భంగా అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News