బెంగళూరు: ఇంట్లో ఓ బాలికను పెంచుకున్నందకు నటి, బిగ్‌బాస్ ఫేం సోను శ్రీనివాసగౌడను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోను ఎనిమిదేళ్ల బాలికను దత్తత తీసుకున్నానని, ఉత్తర కర్నాటకకు తీసుకొచ్చానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దత్తత నిబంధనల ప్రకారం… తాము ఎవరిని ఎక్కడి నుంచి దత్తత తీసుకున్నామో బహిరంగా పరచకూడదు. ఇంట్లో సదరు బాలిక అన్నం తినిపిస్తూ, ముక్కు కుట్టించడం వంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆప్‌లోడ్ చేసింది. దత్తత తీసుకున్నానని, దత్తత తీసుకోవాలని ఉందని పోస్టులు పెట్టడంతో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వీడియోలు పోలీసులకు కనిపించడంతో బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పాటు ఆమెను అరెస్టు చేశారు. పాపతో పని చేయించేకునేందుకు తీసుకొచ్చినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సోనూ గౌడ మాల్దీవులకు వెళ్లినప్పుడు బికినీ ధరించి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వందల్లో ఉన్న ఫాలోవర్లు మిలియన్‌కు చేరుకుంది.
నటి సోను అరెస్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -