Sunday, December 22, 2024

త్వరలోనే బిగ్ బి కెసిబి ని 15వ ఎడిషన్‌

- Advertisement -
- Advertisement -

ముంబై : అమితాబ్ బచ్చన్ అనగానే అందరికి కెబిసి కౌన్‌బనేగా కరోడ్‌పతి గుర్తుకు వస్తుంది. ఈ ప్రఖ్యాత ప్రశ్నల టీవీషో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే బిగ్ బి కెసిబి ని 15వ ఎడిషన్‌తో ముందుకు తీసుకువస్తున్నామని సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ వర్గాలు తెలిపాయి. అందరిని కట్టిపడేసే ఈ తన షో త్వరలోనే రానుందనే విషయాన్ని అమితాబ్ బచ్చన్ కూడా నిర్థారించారు. ఈ షో ప్రిమియర్ అంటే పునః ప్రారంభ ఘట్టం ఆగస్టు 14వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు సోనీలో ప్రతివారం సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఇది ప్రసారం అవుతుంది. కేవలం సోనీలోనే తిరిగి దీనిని మీ ముందుకు తీసుకువస్తున్నామని, కెబిసి తిరిగి అందరిని ఆకట్టుకునేందుకు సిద్ధం అయిందని సోని వర్గాలు ప్రకటన వెలువరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News