Friday, December 27, 2024

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’.. ఆడియో రైట్స్ సోని సొంతం

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు”.

షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలు ‘కలర్ ఫోటో’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్.

Also Read: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’.. ఆడియో రైట్స్ సోని సొంతం

ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.జీఏ2 పిక్చ‌ర్స్, ధీరజ్ మోగిలినేని ఎంటర్టైన్మెంట్స్ , వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.

మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రిలీజ్ చేసిన పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్ చేసారు. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపించారు.ఈ సినిమా ఆడియో రైట్స్ ను సోని మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది.సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News