Friday, December 20, 2024

ఐపిఎల్ టివి ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కే

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ టివి ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కే
డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న రిలయన్స్‌వయాకామ్ సంస్థలు
వేలం పాటలో బిసిసిఐకి రూ.44,075 కోట్ల ఆదాయం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కుల కోసం నిర్వహించిన ఈ వేలం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై కనక వర్షం కురిపించింది. భారత్‌లో ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసారానికి టివి, డిజిటల్ హక్కుల కోసం వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో బిసిసిఐకి రికార్డు స్థాయిలో రూ.44,075 కోట్ల భారీ ఆదాయ లభించింది. 202327 కాలానికి గాను ప్రసార హక్కుల కోసం వేలం నిర్వహించారు. కాగా ఐదేళ్ల కాలానికి గాను టివి ప్రసార హక్కులను ప్రముఖ టివి నెట్ వర్క్ సోనీ సొంతం చేసుకుంది. రానున్న ఐదేళ్ల పాటు సోనీ భారత ఉప ఖండంలో ఐపిఎల్ మ్యాచ్‌లను టివిలో ప్రసారం చేసేందుకు బిసిసిఐకి రూ.23.575 కోట్లను చెల్లించనుంది. మరోవైపు డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ వయాకామ్ సంస్థలు సొంతం చేసుకున్నారు. దీనికిగాను ఈ సంస్థలు రూ.20,500 కోట్లను చెల్లించేందుకు ముందుకు వచ్చాయి.

ఇదిలావుండగా రానున్న సీజన్‌లలో ఐపిఎల్‌లో ఒక్క మ్యాచ్ ప్రసారం కోసం దాదాపు రూ.107 కోట్లను చెల్లించనున్నారు. ఇప్పటి వరకు ఒక్కో మ్యాచ్ ప్రసారానికి రూ.54 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తు వచ్చారు. రానున్న ఐదేళ్ల కాలంలో 410 మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ బోర్డుకు రికార్డు స్థాయిలో రూ.44,075 కోట్ల ఆదాయం లభించనుంది. రానున్న మూడు సీజన్‌లలో 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక చివరి రెండు సీజన్‌లలో 94 మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తాయి. ఇక మ్యాచ్‌ల సంఖ్య పెరిగితే ప్రసార హక్కుల కోసం మరికొంత డబ్బులను సోనీ, రిలయన్స వయాకామ్ సంస్థలు బిసిసిఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఐపిఎల్ ప్రసార హక్కుల కోసం ముంబైలో ఆదివారం ఈ వేలం ప్రారంభమైంది. ఆదివారం తొలి రోజే వేలం పాట బిసిసిఐపై కనక వర్షం కురిపించింది. ఇక సోమవారం రెండో రోజు వేలం పాటలో సోనీ, రిలయన్స్‌వయాకామ్ సంస్థలు టివి, డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నాయి. దీనికి గాను ఈ సంస్థలు వేలాది కోట్ల రూపాలను చెల్లించేందుకు సయితం వెనకాడలేదు. ఇక వేలం పాట ద్వారా ఐపిఎల్‌లో ప్రపంచంలోనే రెండో ధనిక లీగ్‌గా నిలిచింది. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌ను వెనక్కి నెట్టి ఐపిఎల్ ఆదాయంలో రెండో స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం అమెరికా ఫుట్‌బాల్ లీగ్ ఆదాయం అర్జనలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రసార హక్కుల వేలం పాట ద్వారా భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే రెండో అతి ఖరీదైన లీగ్‌గా చరిత్ర సృష్టించింది. ఇదిలావుండగా మరో రెండు ప్రసార హక్కులకు సంబంధించిన వేలం పాట మంగళవారం జరుగనుంది. ఎక్స్‌క్లూజివ్ మ్యాచ్‌ల ప్రసారం, విదేశాల్లో టివి, డిజిటల్ ప్రసార హక్కుల కోసం వేలం పాట నిర్వహించనున్నారు. దీనికి కూడా విపరీత పోటీ ఉండడంతో బిసిసిఐకి మరికొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రావడం ఖాయంగా కనిపిస్తోంది. కిందటిసారి ప్రసార హక్కుల వేలం ఆపట ద్వారా బిసిసిఐకి రూ.16,347 కోట్ల ఆదాయం లభించింది. 201722 సంవత్సరానికి గాను స్టార్ నెట్‌వర్క్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈసారి ఐపిఎల్ మీడియా రైట్స్ కోసం బిసిసిఐ నాలుగు ప్యాకేజీలను ప్రకటించింది. ఇది బిసిసిఐకి ఎంతో కలిసి వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా బిసిసిఐకి కళ్లు చెదిరే ఆదాయం సమకూరింది. ఇక ఇటీవలే ఐపిఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలను చేర్చుకోవడం ద్వారా కూడా బిసిసిఐ వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకున్న సంగతి విదితమే.

Sony Network gets IPL Media Rights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News