Wednesday, January 22, 2025

స్మార్ట్ ఫోన్ స్థానంలో ఈ డివైస్ పెను సంచలనం సృష్టించనుంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్ స్థానంలో ఆపిల్ కంపెనీ ఉద్యోగులు అతి చిన్ని ఎఐ ఫోన్ ను తయారు చేశారు. అతి త్వరలో స్మార్ట్ ఫోన్ స్థానంలో ఈ డివైస్ పెను సంచలనం సృష్టించనుంది. ఆపిల్ కంపెనీలో పని చేసే దంపతులు ఏకంగా హ్యుమన్ ఎఐ పిన్ పేరుతో అతి చిన్న స్మార్ట్ ఫోన్‌ను తయారు చేశారు. హ్యుమన్ ఎఐ పిన్‌ను మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇమ్రాన్ చౌదరీ, బెతానీ అనే దంపతులు గత 20 సంవత్సరాల నుంచి ఆపిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఐఫోన్ ఇంటర్ ఫేస్ విభాగంలో ఇమ్రాన్ పని చేస్తుండగా ఆపిల్ డైరెక్టర్‌గా బెతానీ సేవలందిస్తున్నారు.

ఐఒఎస్ ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తోంది. ఇద్దరు కలిసి గత ఐదు సంవత్సరాల హ్యుమన్ ఎఐ పిన్ పేరిట పరిశోధనలు చేస్తున్నారు. హ్యుమన్ ఎఐ పిన్ అతి చిన్న స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో మంగళవారం విడుదల చేశారు. హ్యుమన్ ఎఐ పిన్ అనేది స్మార్ట్ ఫోన్ల స్థానంలోకి వచ్చేస్తుందని తెలిపారు. స్మార్ట్ ఫోన్ చేసే పనులన్నీ ఈ డివైస్ చేస్తుందని వీడియోలో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News