Monday, January 20, 2025

పుష్ప2 నుంచి మరో పాట విడుదల… డ్యాన్స్ తో దుమ్ములేపారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప2 సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా శ్రేయ ఘోషాల్ అద్భుతమైన గానంతో పాడగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటకు డ్యాన్స్‌తో ఇద్దరు దుమ్ములేపారు. ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప’ అనే పాట విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ అనసూయ భరద్వాజ్, రావు రమేష్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News