Wednesday, November 6, 2024

నేడు జార్ఖండ్‌లో సోరెన్ బలపరీక్ష..

- Advertisement -
- Advertisement -

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో నేడు (సోమవారం) జెఎంఎం సారథ్య ప్రభుత్వ బలపరీక్ష జరుగుతుంది. ఈ నేపధ్యంలో జెఎంఎం, భాగస్వామ్యపక్షాల ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్ నుంచి రాంచీకి బయలుదేరారు. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాల తరువాత సిఎంగా చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా నియుక్తులు అయ్యారు. సభలో విశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ రిసార్ట్‌కు తరలించారు. జెఎంఎం కూటమికి 81 మంది సభ్యుల అసెంబ్లీలో బలనిరూపణకు అవసరం అయిన సంఖ్యాబలం ఉంది.

మొత్తం ఎమ్మెల్యేలు 81 కాగా ఇందులో ఒక్కస్థానం ఖాళీగా ఉంది. బలనిర్థారణకు అవసరం అయిన సంఖ్యాబలం 41. ఈ దశలో మెజార్టీ మార్క్‌కు మించి ఈ కూటమికి ఐదుగురు ఎమ్మెల్యేల బలం ఉంది. జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడి, సిపిఐ (ఎంఎల్)తో కూడిన కూటమిలో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బిజెపి మిత్రపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఏదో అనూహ్య పరిణామం లేదా నాటకీయ ఘటన జరిగితే తప్పితే బలపరీక్షలో ప్రస్తుత కూటమి సర్కారు సునాయాసంగా నెగ్గుతుందని భావిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కానీ బలపరీక్షలో నెగ్గేందుకు పూర్తిస్థాయి సంఖ్యాబలం జెఎంఎంకు ఉందని స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News