Saturday, November 16, 2024

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కల్హేర్: మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి పంట చివరిగింజ వరకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని, రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. రైతుబీమాతో మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.5లక్షల బీమా అందిస్తున్న నాయకుడు కెసిఆర్ అన్నారు.

రైస్ మిల్లర్లకు ప్రభుత్వమే మిల్లు వరకు వడ్లను పంపించి బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నారు. బియ్యాన్ని కొనవల్సిన కేంద్రం కొనక మిల్లులో వానాకాలం వడ్లు రైస్‌మిల్లు , గోదాంలు నిండుగా ఉన్నందున మిల్లులకు వడ్ల తరలింపు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. కేంద్రం చేసే ప్రతి చర్యని రాష్ట్ర ప్రభుత్వానికి రుద్దటం ప్రతిపక్షాలకు అలవాటైందన్నారు. కార్యక్రమంలో జిల్లా డిసిసిబి డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్ రమావత్ రాంసింగ్, ఎంపిపి గుర్రపు సుశీల అంజయ్య, జడ్పిటిసి నర్సింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కిషన్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు మారపు సాయిలు, నాయకులు అరవింద్ కులకర్ణి, ఎంపిపి తనయులు జలేందర్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News