Sunday, November 17, 2024

‘కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి’

- Advertisement -
- Advertisement -

Sort Telangana contract employees

హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలు విడుదల సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ను క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి ప్రతినిధులు కోరారు. ఆదివారం మంత్రుల నివాసంలో వినోద్‌కుమార్‌ను కలిసిన క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి సిఎం కెసిఆర్ 2016లో జీవో నెంబర్ 16 జారీ చేశారని, కొందరు హైకోర్టు వెళ్లడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తాత్కాలికంగా నిలిపి వేశారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్లి మార్గదర్శక సూత్రాలు త్వరగా వచ్చేలా చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో డాక్టర్ అంతే సత్యం, శోభన్‌బాబు, ఉదయ్ శ్రీ, మల్లయ్య, మురళీకృష్ణ ,రాజిరెడ్డి, వెంకటనరసమ్మ ,ఉదయభాస్కర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News