Sunday, December 22, 2024

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ప్యాకెట్లలో 120 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన అనంత కుమార్ బారిక్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. బాలానగర్ ప్రాంతంలో కిరాణా షాపు ఏర్పాటు చేశాడు. కిరణాషాపులో విద్యార్థులు, కార్మికులకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. నిందితుడు ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు.

ఈ విషయం తెలియడంతో బాలానగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేయగా స్కూటర్ డిక్కీలో గంజాయి చాక్లెట్లు దాచిన విషయం చెప్పాడు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News