Tuesday, December 24, 2024

పేకాట స్థావరంపై ఎస్‌ఓటి పోలీసుల దాడి.. 14మంది పేకాట రాయుళ్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : హోటల్‌లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాడుతున్న 14మందిని అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న 1,11,170 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 16 మొబైళ్లు, ఎనిమిది బైక్‌లు, నాలుగు సెట్ల ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మురళి మోహన్, జెన్‌వర్ విశాల్, విష్ణు ప్రసాద్, అశోక్ ఉపాధ్యాయ, సచిన్ సోమని, సంతోష్ కుమార్, విష్ణు శర్మ, విశాక్ శర్మ, అశోక్, కేశవ్, అర్జున్, శ్రావణ్‌కుమార్ యాదవ్, ధీరజ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఎల్‌బి నగర్ కామినేని ఆస్పత్రి సమీపంలోని బాలాజీ గ్రాండ్ హోటల్‌లోని రూమ్ నంబర్ 204లో 14మంది గత కొంత కాలం నుంచి పేకాడుతున్నారు. ఈ విషయం ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. అందరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌బి నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News