Wednesday, January 22, 2025

కల్తీ రాగి పిండి తయారీ కేంద్రంపై ఎస్ఒటి పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

SOT police raid adulterated copper flour manufacturing plant

 

మేడ్చల్: అక్రమ సంపాదనే ధ్యేయంగా కల్తీ రాగి పిండి తయారు చేసే కేంద్రంపై ఎస్ఒటి పోలీసులు దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి పిండిగా తయారుచేసి రాగి పిండిలో కలిపి సీల్డ్ కవర్లలో సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ఒటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి పిఎస్ పరిధిలోని పంచవటి కాలనీలో అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని పిండిగా తయారుచేసి రాగి పిండిలో కలిపి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడిపల్లికి చెందిన బాల సంజీవ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 2 టన్నుల పిడిఎస్ బియ్యం, 350 ప్యాకెట్ల కల్తీ రాగి పిండి, రాగి పిండి తయారీ కోసం ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News