Sunday, January 19, 2025

నకిలీ ఐస్‌క్రీం కంపెనీలపై ఎస్‌ఓటి పోలీసుల దాడులు

- Advertisement -
- Advertisement -

కొందుర్గు: ఆమనగల్లు పట్టణంలో నకిలీ ఐస్‌క్రీం ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటి పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి వెనకాల ఉన్న ఓ ఇంట్లో నకిలీ ఐస్‌క్రీంను తయారు చేస్తున్న మెఘ ఐస్‌క్రీం ఫ్యాక్టరీపై మంగళవారం సాయంత్రం ఎస్‌ఓటి పోలీసులు దాడులు చేసి భారీగా నకిలీ ఐస్‌క్రీంలను, వాహనాలను సీజ్ చేశారు. ఎస్‌ఓటి శంషాబాద్ జోన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎసై రాజేశ్వర్‌రెడ్డి, ఏఏసై రవీందర్‌రెడ్డి, సిబ్బందితో కలిసి నకిలీ ఐస్‌క్రీం ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు.దర్జాగా నకిలీ ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న ముఠా సభ్యులను గుర్తించి, వారి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే వివిధ రకాల ఐస్‌క్రీంలు, పలు వాహానాలను సీజ్ చేశారు.

ఐస్‌క్రీం తయారు చేస్తున్న కంపెనీ 2010 సంవత్సరంలోనే ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాయని 2010 నుంచి మళ్లీ రెన్యువల్ చేసుకోకుండా కనీస నాణ్యత ప్రమాణాలు కూడ పాటించడం లేదని పోలీసులు తెలిపారు. అపరిశుభ్రమైన బోరు నీళ్లతో నకిలీ ఐస్‌క్రీంను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకర్షణీయమైన స్టికర్లను అతికించి, గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటనలో ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రబిక్య తాండాకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎసై సుందరయ్య తెలిపారు.
కొందుర్గులో…
ప్రభుత్వ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా కలు షితమైన మురుగు నీరు, హానికర రసాయనిక పదార్థాలను వాడుతూ ఐస్‌క్రీం తయారీ చేస్తున్న కేంద్రంపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి నిర్వాహకుడిని కొందుర్గు పోలీసులకు అప్పగించారు. కొందుర్గు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… పర్వతాపూర్ గ్రామానికి చెందిన యండి ఆజీమ్ నకిలీ ఐస్‌క్రీంలను తయారు చేస్తున్నాడని వారు తెలిపారు. ఐస్ క్రీంలను తయారు చేసేందుకు సంబంధిత శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేవని వారు తెలిపారు.

ఐస్‌క్రీం తయారీ చేసే వాటిని పరీశీలించగా కలుషితమైన నీరును,హానికర రసాయనిక పదా ర్థాలను ఉపయోగించి ప్రజల ఆరోగ్యానికి హాని కల్గించే విధంగా ఐస్ క్రీంలను తయారు చేసి అమ్ముతున్నారని తెలిసి 3 లక్షల విలువ గల ఐస్‌క్రీంకు వాడే మిషన్లను, తయారీ పదార్థాలను, వాహనాలను వెంటనే సీజ్ చేసి నిర్వాహకు డిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ అను మ తులు లేని ఐస్‌క్రీం సెంటర్లు కొందుర్గు మండలంలో ఇంకా మరి కొన్ని ఉన్న ట్లు విశ్వసనీయ సమాచారం. వాటి పైన కూడా సంబంధిత అధికారులు దాడులు జరిపి వాటిని కుడా సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News