Thursday, December 19, 2024

స్పాలపై ఎస్‌ఓటి పోలీసులు దాడి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పాలపై ఎస్‌ఓటి పోలీసులు దాడులు చేశారు. నిబంధలు ఉల్లంఘిస్తున్న స్పాలపై దాడులు చేసి వాటి యజమానులు, థెరపిస్టులను అరెస్టు చేశారు. కూకట్‌పల్లి డివిజన్‌లోని స్ప్రింగ్ వెల్ స్పా అండ్ మసాజ్ సెంటర్, అవంతి స్పా అండ్ మసాజ్ సెంటర్, సారా వెల్‌నెస్ స్పా అండ్ మసాజ్ సెంటర్,

స్నో యూనిసెక్స్ స్పాఅండ్ మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడులు చేశారు. స్పాల యజమానులు నాగేంద్ర, రంగా సురేఖ, పద్మ, గోపి, తొమ్మిది మంది థెరపిస్టులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12మొబైల్ ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News