Wednesday, January 22, 2025

మేడ్చల్ లో కోడి పందాలు… ఎస్ఒటి టీమ్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేవరాయంజల్ గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న ప్రదేశంపై ఎస్ఒటి మేడ్చల్ టీమ్ దాడి చేసింది.  ఈ రోజు ఉదయం కోడి పందాల బెట్టింగ్ నిర్వహిస్తున్న దేవరాయంజల్ గ్రామంలోని తోట శ్రీనివాస్ ఇంటిపై ఎస్ఒటి మేడ్చల్ టీమ్ దాడి చేసింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న తోట శ్రీనివాస్, సూర్యకాంతి భాను ప్రకాశ్ రెడ్డి, భూపతి రాజగోపాల్, నడింపల్లి ప్రవీణ్,  అనే నలుగురిని పట్టుకున్నారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి మూడు పందెం కోళ్లు, 18 వేల నగదు, మూడు మొబైల్ పోన్లు, 20 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లను పేట  బషీరబాద్ పోలీసులకు అప్పగించారు. మునీరాబాద్ కు చెందిన నెక్కర్ సురేష్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News