హైదరాబాద్: రాంగ్‌రూట్‌లో కారు తీసుకరావడమే కాకుండా ట్రాపిక్ సిబ్బందిపై సినీ నటీమణి దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత శనివారం సౌమ్య జాను తన జాగ్వర్ కారులో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని అగ్రసేన్ చౌరస్తాలో రాంగ్ రూట్‌లో వచ్చింది. అక్కడ హోంగార్డు విఘ్నేష్ విధులు నిర్వహిస్తున్నాడు. రాంగ్‌రూట్‌లో రావొద్దని సౌమ్యకు సూచించాడు. వెంటనే కారులో నుంచి ఆమె దిగి, హోంగార్డు లైప్ జాకెట్ చించివేసి చేతిలోని చరవాణినీ లాక్కొని నేలకొట్టింది. సిసి టివి ఫూటేజీ ఆధారంగా సినీనటి సౌమ్యజానుగా పోలీసులు గుర్తించి ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటి వద్ద లేకపోవడంతో ఫోన్ చేసినా కూడా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఓ టివి ఛానెల్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తాను రాంగ్ రూట్‌లో వచ్చానని, పోలీసులు క్షమించాలని కోరారు. పోలీసులు తనను అసభ్యంగా దూషించడంతో తాను స్పందించానని వివరణ ఇచ్చింది. తాను పోలీసులపై దాడి చేయలేదని, విచారణకు పిలువలేదని చెప్పారు.
హోంగార్డుపై సినీనటి దాడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -