Wednesday, January 22, 2025

డబ్లుహెచ్‌వొ చీఫ్ సైంటిస్ట్ పదవికి సౌమ్య స్వామినాథన్ రాజీనామా!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహెచ్‌ఒ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. నవంబర్ 30న చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత భారత్‌కు రావాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. 63 ఏళ్ల సౌమ్య స్వామినాధన్ డబ్లుహెచ్‌ఒలో ఇప్పటివరకు ఐదేళ్ల పాటు పనిచేశారు. పదవీ విరమణకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రెండేళ్ల ముందస్తుగానే ఈ పదవికి రాజీనామా చేయనున్నారు. కొన్ని ఆచరణీయ కార్యక్రమాలపై విస్తృతంగా పనిచేయాలని భావిస్తున్నానని భారత్ లోనే ఉంటూ తన సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నట్టు ఓ జాతీయ వార్తా పత్రికతో సౌమ్య వెల్లడించారు.

చిన్నపిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్ సౌమ్యస్వామినాధన్, క్షయ, హెచ్‌ఐవీలపై పరిశోధనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ గా రెండేళ్ల పాటు సేవలందించారు. 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ప పదవిలో చేరారు. అదే సమయంలో డబ్లుహెచ్‌ఒలో సైన్సు విభాగం ఏర్పాటు కావడంతో 2019 నుంచి అందులో చీఫ్ సైంటిస్టుగా కొనసాగుతున్నారు.

Soumya Swaminathan resign to WHO Chief Scientist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News