Wednesday, January 22, 2025

ఏషియన్ బెస్ట్ షార్ట్ స్టాఫ్ ప్లేయర్‌గా సౌమ్యరాణి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌స్పోర్ట్: ఈనెల 13నుంచి 17వరకు తైవాన్ దేశంలోని తైపిలో పులి ప్రాంతంలో జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ (అండర్15) ఉమెన్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ఇండియా టీంలో సుంకపాక సౌమ్యరాణి (కెప్టెన్), గుగులోత్ సౌందర్య, దాసరి సరియు, గోక శ్రావిక, గోక సాత్వికలు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో సుంకపాక సౌమ్యరాణి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూనే ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బెస్ట్ షార్ట్ స్టాప్ ప్లేయర్‌గా ప్రత్యేక అవార్డును అందుకున్నట్లు జిల్లా సాప్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగా మోహన్‌లు తెలిపారు.

ఈ సందర్భంగా సుంకపాక సౌమ్యరాణిని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.శోభన్‌బాబు, కోశాధికారి అభిషేక్‌గౌడ్, సాంఘిక సంక్షేమ పాఠశాలల జిల్లా స్పోర్ట్ కోఆర్డినేటర్ పి.నీరజరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ కార్యదర్శి డాక్టర్ కృష్ణ, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఛైర్మన్ బద్దం లింగారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు టి.విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘ బాధ్యులు ఎల్.మధుసూదన్‌రెడ్డి, సుదర్శన్, జైపాల్‌రెడ్డి, మార్కంటి సుజాత, చిప్ప నవీన్, సొప్పరి వినోద్, జోష్ణ, నల్లూరి లత, స్వప్న, భాగ్య, అనీల్, రాజేందర్, వేముల మౌనిక, ఇట్యాల నరేష్, అభిమానులంతా వీరిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News