Monday, December 23, 2024

ట్రెండింగ్ లో `సౌండ్ పార్టీ` ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్

- Advertisement -
- Advertisement -

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`.  వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టిస్తున్నారు.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్ ఇప్ప‌టికే  విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేసింది. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం నుండి `మ‌ని మ‌ని మ‌ని మ‌నీ దీని ముఖ‌ములు సోమెనీ` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు. ప్ర‌జంట్ ఈ సాంగ్ యూట్యూబ్ లో  వైర‌ల్ అవుతోంది.

డ‌బ్బు ప్రాధాన్య‌త  గురించి యువ ర‌చ‌యిత పూర్ణ‌చారి ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే విధంగా పాట రాయ‌గా మోహిత్ రెహ‌మానిక్  దానికి త‌గ్గ‌ట్టుగా మాంచి బీట్ తో కంపోజ్ చేశారు. యూట్యూబ్ లో వైర‌ల్   అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్ తో రీల్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫ‌స్ట్ లిరిక‌ల్ తోనే మంచి బ‌జ్ క్రియేట్ చేసిన `సౌండ్ పార్టీ ` చిత్రం ఇటు ఇండ‌స్ట్రీలో అటు ఆడియ‌న్స్ లో రీ -సౌండ్ సృష్టించ‌డం ఖాయం అన‌డంలో సందేహం లేదు. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో  విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…“ఎప్పుడైతే మా `సౌండ్ పార్టీ` చిత్రం  టీజ‌ర్ విడుద‌లైందో అప్ప‌టి నుంచి మా `సౌండ్ పార్టీ` చిత్రానికి మంచి మంచి బ‌జ్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్ లో వీజే స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమ‌ర్ ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన‌ `సౌండ్ పార్టీ` టైటిల్ ట్రాక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం పాటలు సినిమాకు ఎంత ప్ల‌స్ అవుతున్నాయో, సినిమాను ప‌బ్లిక్ లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాయో చూస్తున్నాం.

ఈ త‌రుణంలో మా సినిమా నుండి రిలీజైన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ కి  మంచి రెస్పాన్స్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాం. మా సంగీత ద‌ర్శ‌కుడు మోహిత్ రెహ‌మానిక్ అద్భుత‌మైన పాట‌ల‌తో పాటు సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ , ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News