Sunday, January 19, 2025

స్మార్ట్ హెడేక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధానపార్టీల అభ్యర్థు లు ఊరూరా ప్రచార రథాలతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రచార గడు వు తక్కువగా ఉండడం తో ఓటర్లందరినీ కలిసి ఓట్లు అడగడం అసా ధ్యం. అందుకే అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని స్మార్ట్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఐవిఆర్‌ఎస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు చేస్తున్నారు. “నమస్తే…

నేను మీ అభ్యర్థిని… అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా… మీ విలువైన ఓటును వినియోగించుకుని నన్ను గెలిపించాలని కోరుతున్నా” అంటూ అభ్యర్థుల గొంతుతో ఓటర్లను ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటితో పాటు సామాజిక మాద్యమాల ద్వారా ఓటర్లకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో వాట్సాప్ గ్రూపులను తయారు చేసుకొని సోషల్ మీడియా ద్వారా ప్రచార చిత్రాలు, లఘు వీడియోలు తీసి ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

చూడలేక, చదవలేక తిప్పలు..

ఎన్నికల వేళ సాంకేతిక పరిజ్ఞానం మితిమీరిపోతోంది. ముఖ్యంగా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లతో ఓటర్లు విసిగిపోతున్నారు. వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేసి చేస్తున్న ప్రచారం సగటు ఓటర్లను ఇబ్బంది పెడుతోంది. ఫొటోలు, వీడియోలు, సమావేశాల సమాచారాన్ని పదుల సంఖ్యలో ఒకేసారి గ్రూపు లో పోస్టు చేస్తుండడం ఓటర్లకు విసుగు తెప్పిస్తోంది. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మండలం, నియోజకవర్గ స్థాయిలో ప్రధానపార్టీల నాయకులు వారికి తెలిసిన నెంబర్లతో గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ గ్రూపులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవడానికి వారి వద్ద ఉన్న నెంబర్లు అన్నీ కలుపుతున్నారు.

ఏదైనా పార్టీకి చెందిన వాట్సాప్ గ్రూపులో ఓ వ్యక్తిని యాడ్ చేస్తే ఇష్టం ఉన్నా లేకున్నా మొహమాటంతో పోస్టులను చూడలేక, చదవలేక సతమతమవుతున్నారు. చేసేది లేక పొరపాటున ఎగ్జిట్ అయితే పార్టీ మనిషి కాదని, భావించే అవకాశం ఉందని గమ్మున ఉంటున్నారు. ఒకే గ్రూపులోనే పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టు లు పెడుతుండడంతో సామాన్య ఓటర్లు అ యోమయానికి గురవుతున్నారు. పార్టీ ల ప్రచారచిత్రాలు, వీడియోలతో ఫోన్లలో స్పేస్ నిండిపోతుందని, నెట్ డాటా తొందరగా అయిపోతోందని పలువురు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News