Monday, December 23, 2024

సముద్రగర్భంలో శబ్దాల గుర్తింపు…

- Advertisement -
- Advertisement -

బోస్టన్ : కెనడా తీరానికి సమీపంలో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే మినీ జలాంతర్గామి గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే ఆ మినీ జలాంతర్గామి ఆచూకీ గాలింపులో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెనడాకు చెందిన పీ8 నిఘా విమానం ఉత్తర అట్లాంటిక్ తీరంలో గాలిస్తూ నీటి అడుగున శబ్దాలను గుర్తించినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ లోని నార్త్ ఈస్ట్ కమాండ్ పేర్కొంది.

దాదాపు ప్రతి 30 నిమిషాలకు శబ్దాలు వినిపించాయని, ఈ విధంగా నాలుగు గంటల పాటు కొనసాగాయని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. దీంతో అమెరికా తన గాలింపు బృందాలు, అదనపు నౌకలు, పరికరాలను ఆ ప్రదేశానికి తరలిస్తోంది కానీ ఆ తర్వాత గాలిస్తున్న సమయంలో మళ్లీ శబ్దాలను గుర్తించలేదని , ప్రతికూల ఫలితాలు వచ్చాయని వివరించింది. అయినా సరే తమ గాలింపు చర్యలు అక్కడ కొనసాగుతున్నట్టు పేర్కొంది.

డీప్‌సీ మ్యాపింగ్ కంపెనీ ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్ కూడా గాలింపులో పాల్గొనడానికి అనుమతులు లభించాయి. గల్లంతైన జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన వ్యాపార వేత్త సాహస యాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, మరో ఇద్దరు ఉన్నారు. దీనిలో సుమారు మరో 30 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News