Monday, January 27, 2025

జడేజా మాయాజాలం.. చిత్తుగా ఓడిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌డిలో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సౌరాష్ట్ర విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 188 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఆయూష్ బడోని (60), యశ్ ధూల్ (44), మయాంక్ 38 (నాటౌట్) మాత్రమే రాణించారు.

రవీంద్ర జడేజా ఐదు, డిఎ జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది. ఓపెనర్ హార్విక్ (93), వస్వదా (62) పరుగులు చేశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఢిల్లీ 94 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 38 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అనంతరం 15 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర వికెట్ నష్టపోకుండానే ఛేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News