కోల్‌కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రికెట్ మైదానంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. తనదైన బ్యాటింగ్‌తో, అద్భుతమైన బౌలింగ్‌తో ఆయన కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు గంగూలీ యాక్టింగ్‌లోకి అడుగుపెట్టారు. అయినా యాక్టింగ్ చేస్తున్నారని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే.. ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ సిరీస్‌లో ఆయన ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ‘ది బెంగాల్ టైగర్ మీట్స్ బెంగాల్ ఛాప్టర్’ అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో గంగూలీ పోలీస్ యూనిఫాంలో కనిపిస్తారు. అది చూసి అందకు ఆశ్చర్యపోగా.. దర్శకుడు హీరో చేయాల్సిన పనులు చెబుతాడు. కానీ, గంగూలీ అవి చేయలేకపోవడంతో.. ఈ సిరీస్‌ని మార్కెటింగ్ చేయాలని కోరుతాడు. అందుకు ఆయన ఓకే అంటాడు. మొత్తానికి ఈ యాడ్ గంగూలీ అభిమానులనే కాదు.. అందరిని ఆకట్టుకుంటుంది. గంగూలీ నిజంగానే ఓ చిన్న పాత్రలో నటిస్తే బాగుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 20వ తేదీ నుంచి ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ ప్రసారం కానుంది.
పోలీస్ గెటప్‌లో గంగూలీ.. ఫస్ట్‌లుక్ అదుర్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -