- Advertisement -
టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి మరోసారి కీలక పదవి దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమించారు. 2021లో గంగూలీకి మొదటిసారి ఈ పదవి దక్కింది. ఇప్పుడు మరోసారి ఆ పదవికి ఆయన నియమితుడయ్యారు. ఈ మేరకు ఐసిసి గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆదివారం ప్రకటన చేసింది. ఈ ప్యానెల్‌లో వివిఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నుంచి ఈ పదవిని గంగూలీ స్వీకరించారు. మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తికాగానే కుంబ్లే ఆ పదవికి రాజీనామా చేశారు.ఇక ఈ ప్యానెల్‌లో వివిఎస్ లక్ష్మణ్‌తో పాటు.. ఆఫ్గనిస్థాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటర్ డెస్మండ్ హేన్స్, సౌతాఫ్రికా టెస్ట్, వన్డే క్యాప్టెన్స టెంబా బవుమా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్‌లు ఉన్నారు.
- Advertisement -