- Advertisement -
ఐసిసి(అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఏప్రిల్ 13న వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సౌరవ్ గంగూలీని ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ఐసిసి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను అనేక విధాలుగా మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను గంగూలీ పర్యవేక్షిస్తారు. గంగూలీతో పాటు, టెంబా బావుమా, హమీద్ హసన్, డెస్మండ్ హేన్స్, జోనాథన్ ట్రాట్ వంటి వారు ప్యానెల్‌లోకి తిరిగి వచ్చారు. 2021లో గంగూలీని మొదట ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -