కోల్‌కతా: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు గంగూలీ ట్వీట్ చేశాడు. క్రీడా జీవితాన్ని ప్రారంభించి ఇప్పటికే 30 ఏళ్లు గడిచి పోయాయని, దీంతో రానున్న రోజుల్లో కొత్త మార్గంలో నడవాలిని భావిస్తున్నట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే రాజకీయాల్లో వస్తానని తెలిపాడు. 30 ఏళ్ల పాటు క్రికెట్‌కు సేవ చేశానని, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సదా రుణపడి ఉంటానని గంగూలీ వివరించాడు.
ఇక కొత్త జీవితంలో కూడా మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కాగా గంగూలీ త్వరలోనే బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాడని జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అయితే గంగూలీతో పాటు బిసిసిఐ కార్యదర్శి జైషా ఈ వార్తలను కొట్టి పారేశారు. గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం లేదని జైషా స్పష్టం చేశారు. గంగూలీ కూడా తన రాజీనామా వార్తలను ఖండించాడు. ఇందులో నిజం లేదని పేర్కొన్నాడు.
Sourav Ganguly tweet on his Political Entry