Wednesday, January 22, 2025

సౌరవ్ గంగూలీకి ఎంత కష్టం వచ్చింది!

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి పెద్ద కష్టమే వచ్చి పడింది! అతి విలువైన అతని సెల్ ఫోన్ పోయిందట. దాని విలువ 1.6 లక్షలు. డబ్బు కోసం కాదు కానీ, అందులో ఎన్నో ముఖ్యమైన నంబర్లు ఉన్నాయట. పైగా అతని బ్యాంకు అకౌంట్లకు ఈ ఫోన్ నంబరే లింక్ చేసి ఉందట. దాంతో సౌరవ్ ఆందోళన చెందుతున్నాడు.

సౌరవ్ గంగూలీ ఇంట్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. రంగులు వేస్తున్న కార్మికుల్లో ఎవరో అదను చూసుకుని తన ఫోన్ ను నొక్కేసి ఉంటారని గంగూలీ అనుమానం. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా తన ఫోన్ ను గత నెల 19వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు చూశాననీ, ఆ తర్వాత ఎంత వెదికినా కనిపించలేదనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News