కోల్‌కతా: మూడు సంవత్సరాల క్రితం అదృశ్యమైన మహిళ అస్థిపంజరం సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 24 పర్గానాస్ జిల్లాలో తుంబా మండల్-బొంబాల్ మండల్ అనే దంపతులు ఉండేవారు. 2020లో తుంబా మండల్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి లక్ష్మణ్ హల్డర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పలుమార్లు భర్తను విచారించినప్పటికి ఎటువంటి పురోగతి కనిపించలేదు. 2020లో తుంబా మండల్ భర్త బొంబాల్ మండల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్యను భర్త చంపినట్టుగా ఆధారాలు లేకపోవడంతో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
Also Read: డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో అమ్మాయిలే ఎక్కువ: సివి ఆనంద్
దీంతో ఆమె తండ్రి లక్ష్మణ్ హోల్డర్ హైకోర్టును ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసును సిఐడికి అప్పగించింది. సిఐడి అధికారులు ఆమె భర్త బొంబాల్ మండల్ అదుపులోకి తీసుకొని పది రోజులు విచారించడంతో జరిగిన విషయం చెప్పాడు. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెకు తలగడంతో ఊపిరాడకుండా చేసి చంపేశానని ఒప్పుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశానని వివరణ ఇచ్చాడు. మహిళ అస్థిపంజరంతో పాటు బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.