Wednesday, January 22, 2025

సౌతాఫ్రికా 95 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

South Africa 95 all out

క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో గురువారం ఆరంభమైన మొదటి టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. డెవోన్ కాన్వే (36), హెన్రీ నికోల్స్ 37 (నాటౌట్) జట్టును ఆదుకున్నారు. ఇప్పటికే కివీస్‌కు 21 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను కివీస్ బౌలర్లు 95 పరుగులకే కుప్పకూల్చారు. మ్యాట్ హెన్రీ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. అతని ధాటికి తట్టుకోలేక సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హెన్రీ 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టులో జుబేర్ హంజా (25) ఒక్కడే కాస్త రాణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News