ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. టెంబా బావుమా సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. గాయాలను నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్గిడిలకు జట్టులో చోటు కల్పించారు. ఇక, వియాన్ ముల్డర్, టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్ మొదటిసారిగా ICC ఈవెంట్‌లో ఆడేందుకు చాన్స్ దక్కింది.
కాగా, ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్, యుఎఇ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్ఘనిస్తాన్ జట్లతో పాటు గ్రూప్ బిలో ఉంది. ఇక, తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 21న కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది సఫారి జట్టు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను ఎదుర్కోనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగీ స్గిడి, తబ్రయిజమ్ న్గిడి స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, అన్రిచ్ నోర్ట్జే.