Sunday, January 19, 2025

ఫైనల్లో సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

మహిళల టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం దుబాయి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి తుది పోరుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జైత్రయాత్రకు తెరదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 134 పరుగులు చేసింది. బెథ్ మూనీ (44), ఎలిసె పేరి (31) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ లౌరా వల్‌వర్డ్ (42), అన్నెకె బోస్చ్ 74 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాను గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News