మిల్లర్, క్లాసెన్ మెరుపులు.. దక్షిణాఫ్రికా శుభారంభం
భారత్‌పై సౌతాఫ్రికా విజయం, శాంసన్, శ్రేయస్ శ్రమ వృథా
లక్నో: భారత్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(4), శిఖర్ ధావన్(3) విఫలమయ్యారు. దీంతో భారత్ 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఇక రుతురాజ్ గైక్వాడ్ (19), ఇషాన్ కిషన్ (20) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు.
అయితే ఈ దశలో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తమపై వేసుకున్నారు. ధాటిగా ఆడిన అయ్యర్ 8 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. అయ్యర్ ఔటైనా శాంసన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే కీలక సమయంలో శార్దూల్ (33) ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 63 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 83 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఆడుకున్నారు. ధాటిగా ఆడిన మిల్లర్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. క్లాసెన్ ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో అజేయంగా 74 పరుగులు చేశాడు. మరోవైపు ఓపెనర్లు డికాక్ (48), మలాన్ (22) తమవంతు పాత్ర పోషించారు.
South Africa beat India by 9 runs in 1st ODI