Friday, November 22, 2024

టెస్టుల్లో ఇండియా, ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసిన దక్షిణాఫ్రికా

- Advertisement -
- Advertisement -

గయానా: రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. ఆతిధ్య విండీస్‌పై 40 పరుగుల తేడాతో గెలుపొంది.. 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో విండీస్ పై పరుసగా పది టెస్టు సిరీస్ లను సఫారి జట్టు గెలిచింది. దీంతో దక్షిణాఫ్రికా టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై వరుసగా 10 టెస్టు సిరీస్ లను గెలిచిన తొలి జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికా కంటే ముందు వరుసగా 9 టెస్టు సిరీస్ లను భారత్, ఆస్ట్రేలియా జట్లు గెలిచాయి. ఇప్పుడా రికార్డు బ్రేక్ చేసింది సఫారి జట్టు.

ఈ టెస్ట్‌లో దక్షిణ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే అలౌట్ అయింది. అయినా సఫారీ బౌలర్లు విండీస్‌ను కేవలం 144 పరుగులకే కట్టడి చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 16 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లలో హోల్ (54), కర్టీ (26)లు మాత్రమే రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మల్డర్ 4, బర్గర్ 3, మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్ సౌతాఫ్రికా మంచి స్కోర్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు అలౌట్ అయింది. వెర్రియెన్నె (59), మక్రమ్ (51), మల్డర్ (34), జోర్జి (39)లు బ్యాట్‌తో మెరిశారు. దీంతో పోరాడే టార్గెట్‌ను విండీస్ ముందు ఉంచగలిగింది. విండీస్ బౌలర్లలో జైడెన్ 6 వికెట్లు తీయగా.. మోతి 2, వరికెన్ 2 వికెట్లు పడగొట్టారు.

చతికిలపడ్డ విండీస్..
263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 222 పరుగుల వద్ద ఆగిపోయింది. విండీస్ బ్యాటర్లలో మోతి (45) పరుగులు చేయగా.. హోడ్జ్ (29), సిల్వ (27), బ్రాత్ వైట్ (25), వరికమ్ (25) రాణించినా మిగతావరెవరూ రాణించకపోవడంతో స్వల్ప లక్షాన్ని సయితం విండీస్ ఛేదించలేక పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా.. మల్డర్, పిట్ రెండేసి వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును మల్డర్ దక్కించుకోగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కేశవ్ మహారాజ్ నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News