Wednesday, January 22, 2025

ఆసీస్‌తో టి20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే

- Advertisement -
- Advertisement -

జోహనెస్ట్‌బర్గ్ : వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ లక్షంగా జట్టును సన్నద్దం చేసే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది సఫారీ(దక్షిణాఫ్రికా) క్రికెట్ బోర్డు. అందులో భాగంగానే ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్‌కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందులో డొనవాన్ ఫెరెరా, డెవాల్ బ్రెవిస్, గెరాల్ కొయెట్జీ, మాథ్యూ బ్రీట్జ్‌కెలను ఎంపిక చేసింది. ఈ నలుగురు ఒకేసారి ఈ సిరీస్‌తో టి20 ఫార్మాట్‌లో కెరీర్ ప్రారంభించనుండటం గమనార్హం. ఇక కేశవ్ మహారాజ్ సైయితం త్వరలోనే జట్టులోకి రానున్నాడు.

సోమవారం ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబడా, అన్రిచ్ నొర్జెలకు చోటు కల్పించలేదు సఫారీ బోర్డు. వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ ఐదుగురు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారని సెలెక్టర్లు తెలిపారు. దేశవాళీలో, ఇతర లీగ్స్‌లో ఈ యువ ఆటగాళ్లంతా రాణిస్తుండటంతో అందుకనే వీళ్లను ఎంపిక చేశాం. అంతర్జాతీయంగా వీళ్ల ప్రదర్శనపై అంచనాకు రావడానికి ఈ సిరీస్ ఉపకరిస్తుంది’ అని కోచ్ రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు. అయితే జట్టు నిండా స్టార్ ఆటగాళ్లున్నా ఇప్పటి వరకూ ఏ ఒక్క ఐసిసి ట్రోఫీని గెలువని జట్టు సఫారీయే. ఈ కసరత్తు అయినా ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News