Monday, December 23, 2024

నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. అర్షదీప్ రికార్డ్

- Advertisement -
- Advertisement -

జోహన్నెస్ బర్గ్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్‌ కు 117 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయి ఆడారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాకు వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్ ఆరంభంలో మూడు వికెట్లు పడగొట్టాడు.

వన్డే క్రికెట్‌లో ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో తన ఖాతాను తెరిచాడు. అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా  భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో 116 పరుగులకు కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించాలంటే భారత్ ఇప్పుడు 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News